పేదలకు అందని ద్రాక్షలా విద్య, వైద్యం

భారాస పాలనలో పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

Published : 01 Apr 2023 05:14 IST

జోడో యాత్రలో భట్టి విక్రమార్క విమర్శ

బెల్లంపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: భారాస పాలనలో పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం నిర్వహించిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయాల్సిన యంత్రాంగం, మౌలిక వసతుల కల్పనపై చిన్నచూపు చూస్తోందన్నారు. బెల్లంపల్లి డిగ్రీ కళాశాలలో 800 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నా.. సరిపడినన్ని మరుగుదొడ్లు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు వస్తే గేట్లు తీయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని