కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకులుగా తెలుగు నాయకులు

కర్ణాటకలో మే 10న జరగబోయే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐసీసీ శుక్రవారం 66 మంది పర్యవేక్షకులను నియమించింది.

Published : 15 Apr 2023 04:41 IST

ఏపీ, తెలంగాణల నుంచి నియామకం

ఈనాడు, దిల్లీ: కర్ణాటకలో మే 10న జరగబోయే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఏఐసీసీ శుక్రవారం 66 మంది పర్యవేక్షకులను నియమించింది. ఇందులో అయిదుగురు బెంగుళూరు నగరానికి, మిగిలినవారు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో బెంగుళూరు నగర పర్యవేక్షకుడిగా ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి నియమితులయ్యారు. వివిధ అసెంబ్లీ స్థాయి పరిశీలకులుగా బెల్లయ్య నాయక్‌ తెజావత్‌, జేడీ శీలం, మల్లు రవి, షేక్‌ మస్తాన్‌ వలీ, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, సాకే శైలజానాథ్‌, సీతక్క నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని