Nara Lokesh: చంద్రబాబు అంటేనే బ్రాండ్.. జగనంటే జైలు: లోకేశ్
చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అని.. ఆయన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయని, జగన్ అంటే జైలని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
ఈనాడు, కర్నూలు: చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అని.. ఆయన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయని, జగన్ అంటే జైలని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గం నాగలాపురంలో ఆయన ‘యువతతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. బోధన రుసుములు జమకాకపోవడంతో అప్పులు చేసి చెల్లించాల్సి వస్తోందని ఒకరు.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మోసం చేశారని మరికొందరు, గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని ఇంకొందరు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. డీఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా హయాంలో వేల పరిశ్రమలు, ఆరు లక్షల ఉద్యోగాలు వస్తే.. జగన్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయారన్నారు. ‘జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి క్యాపిటల్’గా మార్చారని ఎద్దేవా చేశారు. ఎవరి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చించడానికి కోడిగుడ్డు మంత్రి సిద్ధమా? అని సవాలు విసిరారు. మూడు రాజధానులని చెబుతూ మూడుచోట్లా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని... ఆయా ప్రాంతాలకు ఆయన చేసిందేమిటో చెప్పాలన్నారు. నోటికి వచ్చిన తేదీ చెప్పడం మినహా విశాఖ, కర్నూలును అభివృద్ధి చేయడానికి ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా? అని ప్రశ్నించారు. ఆయనో స్టిక్కర్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి తన తండ్రి పేరు పెట్టుకున్నారని.. తాజాగా విశాఖలో వ్యూపాయింట్‌కు అబ్దుల్ కలాం పేరును తొలగించి తన తండ్రి పేరు పెట్టుకున్నారని, విదేశీ విద్యకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరును తొలగించి తన పేరును పెట్టుకున్నారని వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!