MLA Muthireddy Daughter: ‘నాన్నా.. ఎందుకు రాజీనామా చేయడంలేదు?’

చేర్యాలలోని పెద్ద చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు మా నాన్న యాదగిరిరెడ్డి అంగీకరించారు కదా.. ఇంకా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి ప్రశ్నించారు.

Updated : 20 Jul 2023 06:58 IST

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కుమార్తె ప్రశ్న

జనగామటౌన్‌, న్యూస్‌టుడే: ‘చేర్యాలలోని పెద్ద చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు మా నాన్న యాదగిరిరెడ్డి అంగీకరించారు కదా.. ఇంకా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి ప్రశ్నించారు. కుమార్తె భవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఇటీవల ముత్తిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కేసు నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడిపై జనగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు హైదరాబాద్‌లో రాహుల్‌రెడ్డి కార్యాలయంలో పని చేసే కొత్తూరు శివరామకృష్ణను విచారణ నిమిత్తం జనగామ ఠాణాకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బుధవారం భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డి, శివరామకృష్ణ జనగామకు వచ్చారు. డీసీపీ కార్యాలయంలో, పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వారిని పోలీసులు విచారించారు. అనంతరం భవానీరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆయన చేసిన తప్పులను బయటపెడుతున్నాననే అక్కసుతోనే తమపై కోర్టుకు వెళ్లారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని