వైకాపాలో చేరిన ముద్రగడ

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరారు. ముద్రగడ కుమారుడు గిరితో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.

Published : 16 Mar 2024 05:24 IST

మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైకాపాలో చేరారు. ముద్రగడ కుమారుడు గిరితో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సీఎం వారిద్దరికీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2019లో జనసేన తరఫున పోటీ చేసిన నవుడు వెంకటరమణ కూడా వేర్వేరుగా సీఎం సమక్షంలో వైకాపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని