భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం

భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 06 May 2024 06:12 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, రెండేళ్ల తర్వాత శాశ్వత పట్టా ఇస్తారని తెలిపారు. ఈలోగా వివాదం ఏర్పడితే.. చిన్న యజమానులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భూములన్నీ ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని భూములను గిరిజనేతరులు తప్పుడు రికార్డులు సృష్టించి అనుభవిస్తున్నారని, ఇప్పుడు వాటికి చట్టబద్ధత వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని