సీఎఫ్‌డీ ‘ఏపీ ఎలక్షన్‌ వాచ్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Published : 06 May 2024 06:11 IST

కోడ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే అవకాశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.  రాష్ట్ర స్థాయి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల పేర్లు, వారి హోదా, ఫోన్‌ నంబర్లు ఈ మెయిల్‌ ఐడీలను ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. క్షేత్రస్థాయి సమస్యలు, కోడ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదులు నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. వీటిని సీఎఫ్‌డీ ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఎన్నికల అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు తదితర అంశాలపై ఫిర్యాదులకు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సీఎఫ్‌డీ     ప్రతినిధులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని