YSRCP: ఎన్నికల బరిలో పదోసారి తమ్మినేని, పెద్దిరెడ్డి

వైకాపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అభ్యర్థి తమ్మినేని సీతారాం, చిత్తూరు జిల్లా పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావులు ఎన్నికల బరిలో పదోసారి పోటీ నిలబడనున్నారు.

Updated : 17 Mar 2024 09:52 IST

వీరితో పాటు గొల్లపల్లి సూర్యారావు కూడా

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అభ్యర్థి తమ్మినేని సీతారాం, చిత్తూరు జిల్లా పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావులు ఎన్నికల బరిలో పదోసారి పోటీ నిలబడనున్నారు. విజయనగరం నుంచి బరిలో నిలుస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి, కర్నూలు జిల్లా పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 9వ సారి బరిలో నిలుస్తున్నారు.

  • శ్రీకాకుళం అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులు, పీలేరు అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎనిమిదోసారి పోటీలో ఉన్నారు.
  • తాడేపల్లిగూడెం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కోనసీమ జిల్లా అమలాపురం అభ్యర్థి పినిపే విశ్వరూప్‌, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు, ప్రకాశం జిల్లా ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏడోసారి పోటీ పడుతున్నారు.
  • ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట), మేకా ప్రతాప్‌ అప్పారావు (నూజివీడు) ఆరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
  • అయిదోసారి బరిలో నిలబడుతున్నవారిలో బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పీడిక రాజన్న దొర (సాలూరు), ఆర్కే రోజా (నగరి), కంబాల జోగులు (పాయకరావుపేట), కరణం ధర్మశ్రీ (చోడవరం), రమణమూర్తిరాజు (ఎలమంచిలి), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), ఎస్‌.చినఅప్పలనాయుడు (బొబ్బిలి), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), కోరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు), విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ), ఆదాల ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు గ్రామీణ), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కొడాలి నాని (గుడివాడ), మేకతోటి సుచరిత (తాడికొండ), ఆళ్ల నాని (ఏలూరు), గ్రంధి శ్రీనివాస్‌ (భీమవరం), ప్రసాదరాజు (నరసాపురం) ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని