జగన్‌ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ

వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

Published : 19 Mar 2024 05:04 IST

సీపీఎం, కాంగ్రెస్‌తో కలిసి పోటీ?

విద్యాధరపురం, న్యూస్‌టుడే: వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడ సితార కూడలి సమీపంలోని ఓ కన్వెన్షన్‌లో సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. జగన్‌ అరాచక పాలనకు కేంద్రంలోని భాజపా అండగా నిలిచిందన్నారు. చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌, వైకాపా ఒకటేనని చెప్పడాన్ని ఆక్షేపించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని.. విజయవాడ పశ్చిమ నుంచి సీపీఐ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. సీపీఐ కేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి ప్రధాని హోదాలో శంకుస్థాపన చేసిన అనంతరం.. సీఎం జగన్‌ మూడు రాజధానులు అంటే ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని