తెదేపా ప్రచారంలో పాల్గొన్న ముస్లింలపై వైకాపా కార్యకర్తల దాడి

తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని ముగ్గురు ముస్లింలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది.

Published : 16 Apr 2024 06:05 IST

ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తామని బెదిరింపు
పల్నాడు జిల్లా తొండపిలో ఘటన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తెదేపా ప్రచారంలో పాల్గొన్నారని ముగ్గురు ముస్లింలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుల వివరాలమేరకు.. సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు ఆదివారం రాత్రి తొండపిలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో స్థానిక ముస్లిం కాలనీకి చెందిన షేక్‌ బాజీ, సయ్యద్‌ బాజీ, బందెల సుభానీతోపాటు పలువురు పాల్గొన్నారు. దీంతో వైకాపా కార్యకర్తలు వారిపై కక్షగట్టారు. రాత్రి ప్రచారం ముగిసిన తర్వాత షేక్‌ బాజీ, సయ్యద్‌ బాజీ, బందెల సుభానీల ఇళ్లకు వెళ్లి దుర్భాషలాడుతూ దాడి చేశారు. తెదేపాకు ఎవరు మద్దతు ఇచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెదేపాకు మద్దతుగా ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తామని బెదిరించారు. ప్రచారంలో ఎలా పాల్గొంటారని కొట్టారు. ఈ ఘటనపై బాధితుడు బాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా కార్యకర్తలు అయిదుగురు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై సోమవారం పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని