గులకరాయి డ్రామా సూత్రధారులు వెలంపల్లి, కేశినేని నానిలే

గులకరాయి డ్రామా సూత్రధారి, పాత్రధారి వెలంపల్లి శ్రీనివాస్‌, కేశినేని నానిలేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 16 Apr 2024 04:34 IST

సీబీఐతో విచారణ జరిపించాల్సిందే
బొండా ఉమా డిమాండ్‌

విజయవాడ (మొగల్రాజపురం, చుట్టుగుంట), న్యూస్‌టుడే: గులకరాయి డ్రామా సూత్రధారి, పాత్రధారి వెలంపల్లి శ్రీనివాస్‌, కేశినేని నానిలేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. మరో 27 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని గులకరాయితో కొట్టించుకోవడం, ప్రాణహాని అని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఈ డ్రామాకు ఒక్క వైకాపా కార్యకర్త కూడా జెండా పట్టుకొని బయటకు రాలేదని వివరించారు. సంఘటన జరిగి 48 గంటలు గడిచినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రణాళిక ప్రకారం జరిగిన డ్రామానే అని స్పష్టమవుతోందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీషీటర్‌ బంకా శివ చేశాడని తమకు సమాచారం ఉందని తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద భవనాలు ఉన్నప్పుడు.. వీవీఐపీ వస్తుంటే వాటిపై పోలీసులు ఎందుకు లేరని ప్రశ్నించారు. మళ్లీ సానుభూతి కోసం చంద్రబాబునాయుడిపై, తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. దీనిపై సీబీఐ విచారించాలని డిమాండ్‌ చేశారు. నగర కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై బెంజి సర్కిల్‌లో జరిగిన దాడిలో ఆయన కంటిచూపు కోల్పోయినప్పటికీ 307 కేసు పెట్టలేదని గుర్తు చేశారు. దీనిని గవర్నరు దృష్టికీ తీసుకెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని