కేంద్రంలో కాంగ్రెస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: జగ్గారెడ్డి

‘దేశానికి అప్పులు చేసే ప్రధాని వద్దని.. సుపరిపాలన అందించే కాంగ్రెస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Published : 16 Apr 2024 05:04 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ‘దేశానికి అప్పులు చేసే ప్రధాని వద్దని.. సుపరిపాలన అందించే కాంగ్రెస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భాజపా ప్రభుత్వానికి అప్పులు చేయమని రాముడు చెప్పారా..?’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తొలి ప్రధాని నెహ్రూ నుంచి  మన్మోహన్‌సింగ్‌ వరకు దేశం అప్పు రూ.55 లక్షల కోట్లకు చేరితే.. మోదీ ప్రధాని అయ్యాక పదేళ్లలోనే రూ.113 లక్షల కోట్లు అయ్యింది. మూడోసారి అధికారంలోకి వచ్చి ఇంకా ఏం చేస్తారు..? రాహుల్‌ ప్రధాని అయితే అన్నింటి ధరలు తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 15 ఎంపీ సీట్లు గెలిచేలా ప్రజలు సహకరించాలి’ అని కోరారు. ఏపీలో రాళ్లతో కొట్టారని సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు మధ్య పంచాయితీ నడుస్తోందని, ఇలా కొట్టుకుంటే ఏమి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ గురించి ఆలోచన చేయాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని