కామారెడ్డి పురపాలిక కాంగ్రెస్‌ కైవసం

కామారెడ్డి పురపాలికను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గతంలో భారాసకు చెందిన నిట్టు జాహ్నవి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. ఆమెపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గత నెల 30వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

Published : 16 Apr 2024 05:06 IST

ఛైర్‌పర్సన్‌గా ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నిక

ఈనాడు, కామారెడ్డి: కామారెడ్డి పురపాలికను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గతంలో భారాసకు చెందిన నిట్టు జాహ్నవి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉండగా.. ఆమెపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గత నెల 30వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కాంగ్రెస్‌ బలపరిచిన గడ్డం ఇందుప్రియను ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె ఇదివరకు వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. బల్దియాలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందుప్రియ ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులైన 28 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. భారాసకు చెందిన 15 మంది, భాజపాకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు దూరంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని