జగన్‌తో వారి కుటుంబసభ్యులకే ప్రాణహాని

అధికారం కోసం తన కుటుంబసభ్యులను హతమార్చడానికి కూడా సీఎం జగన్‌ వెనుకాడరని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. గత ఎన్నికల ముందు జరిగిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 05:08 IST

అందుకే విదేశాలకు వెళ్లిపోయిన విజయమ్మ
సజ్జల దర్శకత్వంలోనే ‘గులకరాయి’ నాటకం
తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికారం కోసం తన కుటుంబసభ్యులను హతమార్చడానికి కూడా సీఎం జగన్‌ వెనుకాడరని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. గత ఎన్నికల ముందు జరిగిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయోనని ఆయన కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోత్తున్నారని, సీఎం తల్లి విజయమ్మ కూడా ఆ భయంతోనే విదేశాలకు వెళ్లిపోయారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌కు చంపడమనేది వెన్నతో పెట్టిన విద్య. వారి కుటుంబసభ్యులంతా జాగ్రత్తగా ఉండాలి. 2019 ఎన్నికల సమయంలో గొడ్డలి వేటుతో బాబాయిని హతమార్చి, కోడికత్తి డ్రామాతో అమాయకులను జైలుకు పంపారు. ఈ ఎన్నికల్లో బస్సు యాత్రలో జనం కనిపించకపోయే సరికి ఆయోమయానికి గురయ్యారు. అందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘గులకరాయి’ నాటకానికి తెరలేపారు. ఈ ఘటనకు కర్త, కర్మ మొత్తం ఆయనే. రాయి దాడి జరుగుతుంటే పోలీసు, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని పోలీసు అధికారులను విధుల నుంచి వెంటనే తప్పించాలి’ అని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని