కార్యకర్తల్లో భరోసా నింపడానికే ‘నిజం గెలవాలి’ యాత్ర

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబసభ్యుల్లో భరోసా నింపడానికే ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.

Published : 16 Apr 2024 05:09 IST

తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబసభ్యుల్లో భరోసా నింపడానికే ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన 2023 సెప్టెంబరు 9వ తేదీని రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్‌ డేగా అభివర్ణించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా భువనేశ్వరి ప్రజలకు 27 రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. 95 నియోజకవర్గాల్లో పర్యటించి 203 కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు. ఎన్నికల కోడ్‌కు ముందు వరకు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ‘నిజం గెలవాలి’ యాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే 161 స్థానాలు గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని