భారాస మునిగింది.. కాంగ్రెస్‌ మునగబోతోంది

భారాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 16 Apr 2024 05:10 IST

భాజపా నేత లక్ష్మణ్‌

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: భారాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభంజనం కనిపిస్తోందన్నారు. ఓట్లడిగే నైతిక హక్కు భారాస నేతలకు లేదు, ఆ పార్టీ రాష్ట్రంలో గల్లంతయిందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవదన్నారు. భాజపా సంకల్ప పత్రంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌కు కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేళ్ల హయాంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్నారు. భారాస మునిగిన పడవ అని, కాంగ్రెస్‌ మునగబోతున్న నావ అని ఎద్దేవా చేశారు. కులం, మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు కాంగ్రెస్‌ చేస్తోందని ఆరోపించారు. 

భారాసను ఎవరూ నమ్మరు: అర్వింద్‌

ప్రతి భారతీయుడికి ప్రస్తుత ఎన్నికలు అతి ముఖ్యమైనవని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. భాజపా మ్యానిఫెస్టోను 140 కోట్ల మంది దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. ఎన్డీయేకు 400 సీట్ల్లు వస్తాయని పేర్కొన్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భారాసను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని