కిషన్‌రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు నిరంజన్‌ ఫిర్యాదు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఫిర్యాదు చేశారు.

Published : 16 Apr 2024 05:11 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. ఈనెల 8న కిషన్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన భాజపా బూత్‌ స్థాయి అధ్యక్షుల సమావేశంలో ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో హిందూ వ్యతిరేకంగా ఉంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారని ఎన్నికల ప్రధాన కమిషనర్‌(ఈసీఐ) రాజీవ్‌కుమార్‌కు సోమవారం లేఖ రాశారు. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. తక్షణం కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని