బలహీనవర్గాలకు భాజపా వ్యతిరేకం

భాజపా మ్యానిఫెస్టోలోని 14 అంశాల్లో బీసీలకు ఒక్క హామీ లేకపోవడం శోచనీయమని, అది బలహీనవర్గాల వ్యతిరేక పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 16 Apr 2024 05:12 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా మ్యానిఫెస్టోలోని 14 అంశాల్లో బీసీలకు ఒక్క హామీ లేకపోవడం శోచనీయమని, అది బలహీనవర్గాల వ్యతిరేక పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ‘పాంచ్‌ న్యాయ్‌’లో బలహీనవర్గాలకు పెద్దపీట వేసిందని, కులగణన సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందులో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. దేశంలోని బడుగు బలహీనవర్గాలంతా ఈ విషయాలను గమనించాలని కోరారు. అలాగే తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడాలని, నూలు ఉత్పత్తులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అతిథులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్‌ టవళ్లను కప్పాలన్నారు. ఇవైతే ఇంటి అవసరాలకైనా ఉపయోగపడతాయని, శాలువాలు ఎందుకూ పనికి రావని పేర్కొన్నారు. లేదంటే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు ఇవ్వాలని మంత్రి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని