కేసీఆర్‌ రైతు భరోసా.. అన్నదాతల కష్టనష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు

కరవుతో అల్లాడుతున్న అన్నదాతలకు భరోసా అందించాలని భారాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. రైతుల వద్దకే వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు.

Updated : 17 Apr 2024 06:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరవుతో అల్లాడుతున్న అన్నదాతలకు భరోసా అందించాలని భారాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. రైతుల వద్దకే వెళ్లి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్‌, చేవెళ్ల, సంగారెడ్డిలలో నిర్వహించిన బహిరంగసభల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని భారాస పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ కావాలని పార్టీ తీర్మానించింది. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ ప్రచార సరళిని రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 18న దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికపై చర్చించి తుది రూపు ఇవ్వనున్నారు. అదేరోజు తెలంగాణభవన్‌లో ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫారాలు, ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును కూడా అందించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలపై కేసీఆర్‌ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు ఇతర ముఖ్యులు పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని