లోక్‌సభ ఎన్నికలకు 49 మంది పరిశీలకులు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణకు 49 మంది సీనియర్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

Published : 17 Apr 2024 04:20 IST

నియమించిన ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణకు 49 మంది సీనియర్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు వచ్చే నెల 13వ తేదీన పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నియమించినవారిలో 23 మంది వ్యయ పరిశీలకులు, 17 మంది సాధారణ పరిశీలకులు, తొమ్మిది మంది పోలీసు పరిశీలకులు ఉన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులను, వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున.. సికింద్రాబాద్‌ లోక్‌సభ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఒకరు.. ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున వ్యయ పరిశీలకుడిగా నియమితులయ్యారు. అలాగే 17 లోక్‌సభ నియోజకవర్గాలకు తొమ్మిది మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని