ప్రభుత్వాన్ని టచ్‌ చేస్తే.. తెలంగాణభవన్‌ పునాదులు లేకుండా చేస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో.. పార్టీని టచ్‌ చేయాలని చూస్తే హైదరాబాద్‌లో భారాస కార్యాలయం తెలంగాణభవన్‌ పునాదులు లేకుండా చేస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 18 Apr 2024 04:02 IST

30 మంది భారాస ఎమ్మెల్యేలు వస్తామంటున్నా మేమే వద్దంటున్నాం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో.. పార్టీని టచ్‌ చేయాలని చూస్తే హైదరాబాద్‌లో భారాస కార్యాలయం తెలంగాణభవన్‌ పునాదులు లేకుండా చేస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదంటూ మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన నిధులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా.. అని ప్రశ్నించారు. భారాసకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతామన్నా.. తామే వద్దంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ తలుపులు తెరిస్తే భారాసలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. అవినీతి కేసుల్లో ఎమ్మెల్సీ కవిత జైలుకుపోయినప్పటి నుంచి కేసీఆర్‌ మతి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి సరిపోయే విధంగా రెండు పడక గదుల ఇల్లు చర్లపల్లి జైలులో కట్టిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారాసకు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని