గురుకులాలపై సీఎం వివక్ష: భారాస

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌ విమర్శించారు.

Published : 18 Apr 2024 04:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురుకులాల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారని, విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు భారీగా పెంచారని, విద్యా శాఖపై సీఎం కనీసం సమీక్ష నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు. భువనగిరి వసతిగృహంలో విషాహారం కారణంగా విద్యార్థి ప్రశాంత్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని