నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు

ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్‌.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Updated : 30 Apr 2024 07:00 IST

తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్‌.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. అప్పుల కోసం తప్పుడు లెక్కలతో జీఎస్‌డీపీని పెంచారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి 98 శాతం ఉంటే.. జగన్‌ పాలనలో 66 శాతానికి పరిమితమైందన్నారు. పన్నుల ఆదాయంలో గత ప్రభుత్వం 119 శాతం వృద్ధి సాధిస్తే.. నేడు 47.5 శాతానికి తగ్గిందని తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లడుగుతానన్న జగన్‌రెడ్డి పాలనలో మద్యం ఆదాయం గణనీయంగా పెరిగింది. గతంలో రూ.72 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయం.. ప్రస్తుతం రూ.1.22 లక్షల కోట్లకు చేరింది’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని