అనంత్‌నాగ్‌ నుంచి ఆజాద్‌ పోటీ చేయట్లేదు: డీపీఏపీ

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్‌.. అనంత్‌నాగ్‌-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది.

Published : 18 Apr 2024 04:10 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్‌.. అనంత్‌నాగ్‌-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. తొలుత ఆజాద్‌  ఈ సీటు నుంచి బరిలో నిలుస్తారని ఈ నెల 2న వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల  ఇక్కడి నుంచి మహ్మద్‌ సలీం పర్రేను బరిలోకి దించుతున్నట్లు డీపీఏపీ కశ్మీర్‌ ప్రొవిన్షియల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అమీన్‌ భట్‌ తెలిపారు. బుధవారం జరిగిన డీపీఏపీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఆజాద్‌ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు, ఈ సీటు నుంచి పీడీపీ అభ్యర్థిగా మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ‘ఇండియా’ కూటమి నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత మియాన్‌ అల్తాఫ్‌ అహ్మద్‌ బరిలో నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని