లోకేశ్‌ తరఫున నామినేషన్‌ దాఖలు

గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్‌ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను గురువారం రిటర్నింగ్‌ అధికారి రాజకుమారికి అందజేశారు.

Published : 19 Apr 2024 06:00 IST

గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్‌ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను గురువారం రిటర్నింగ్‌ అధికారి రాజకుమారికి అందజేశారు. తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రేఖా సుధాకర్‌గౌడ్‌, ఎండీ ఇబ్రహీం తదితరులు ఒక సెట్‌ అందజేశారు. మరో సెట్‌ను పోతినేని శ్రీనివాసరావు, వేమూరి మైనర్‌బాబు, భాజపా సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్‌, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి సమర్పించారు.


విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత సుజనా చౌదరి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.  భవానీపురంలోని తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని రిటర్నింగ్‌ అధికారిణి కిరణ్మయికి నామపత్రం అందజేశారు.


భీమిలిలో తెదేపా అభ్యర్థి గంటా

విశాఖ జిల్లా భీమిలి కూటమి అభ్యర్థిగా తెదేపా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.భాస్కరరెడ్డికి రెండు సెట్ల నామినేషన్లను సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని