పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా?: దేవినేని

పోలవరం ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తిపడి నిర్లక్ష్యం చేసి, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు ఆపడం సీఎం జగన్‌ చేసిన తప్పిదమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 03 Jun 2022 05:53 IST

రాజమహేంద్రవరం (క్వారీసెంటర్‌), న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టును కమీషన్లకు కక్కుర్తిపడి నిర్లక్ష్యం చేసి, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు ఆపడం సీఎం జగన్‌ చేసిన తప్పిదమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శాసనసభలో 2022కల్లా పూర్తి చేస్తామన్నారని, ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదంటున్నారని, పైగా చర్చకు రావాలని మాజీ సీఎం చంద్రబాబుకు, తనకు సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము చర్చకు సిద్ధమేనని, తాడేపల్లి రమ్మంటారా... పోలవరం ప్రాజెక్టు వద్దకు రమ్మంటారా... అని సీఎం జగన్‌కు, మంత్రి అంబటికి దేవినేని సవాలు విసిరారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని... రెండింటినీ వైకాపా ప్రభుత్వం కుదేలు చేసిందని విమర్శించారు. పవర్‌ ప్రాజెక్టు పూర్తయితే 900 మెగావాట్ల జలవిద్యుత్తు వచ్చేదన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. సీఎం జగన్‌ ప్రధానితో దేని గురించి మాట్లాడారో మీడియాకు వెల్లడించాలని డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలో ఒక ఎమ్మెల్యే జలవనరుల శాఖ ఏఈఈపై చేయి చేసుకోవడం దారుణమన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని