విజయసాయి, దేవేందర్‌రెడ్డిలపై తెదేపా ఫిర్యాదు

రాజ్యసభ సభ్యుడు, వైకాపా నేత విజయసాయిరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు

Published : 06 Aug 2022 04:28 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాజ్యసభ సభ్యుడు, వైకాపా నేత విజయసాయిరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ తెదేపా మహిళా నేతలు కాట్రగడ్డ ప్రసూన, షకీలారెడ్డి, సూర్యదేవర లత బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌కు శుక్రవారం ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌ ప్రతిష్ఠ, ఎన్టీఆర్‌ అభిమానుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉమామహేశ్వరి మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. న్యాయసలహా తీసుకొని కేసు నమోదుచేసే అంశాన్ని పరిశీలిస్తామని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

చర్యలు తీసుకోవాలి: వర్ల
ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా నాయకులపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ హోదాలో దేవేంద్రరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐడీ ఏడీజీకి శుక్రవారం లేఖ రాశారు. ‘తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై దేవేంద్రరెడ్డి నిస్సిగ్గుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి సైతం తెదేపా నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఈ నెల 3న తప్పుడు ప్రచారం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని