ఎంపీ కోమటిరెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు

మునుగోడు నియోజకవర్గం చండూరు సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ప్రకటించారు. క్రమశిక్షణ కమిటీ నుంచి

Published : 07 Aug 2022 05:13 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడు నియోజకవర్గం చండూరు సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ప్రకటించారు. క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఆయన.. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వెంకట్‌రెడ్డిపై కావాలని అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తొందరపాటులో తప్పులు దొర్లాయన్నారు. తన వ్యాఖ్యలతో వెంకట్‌రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందున స్వయంగా ఆయనను కలిసి క్షమాపణలు చెప్తానని అన్నారు. వెంకట్‌రెడ్డి అభిమానులు కూడా క్షమించాలని కోరుతున్నానని తెలిపారు. కాగా అనుచిత పదజాలంతో దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయనకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి వర్గీయులు శనివారం ఆందోళనకు దిగారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల అద్దంకి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

శ్రవణ్‌ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్‌ నేతలు

రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు.  మరోసారి నోరు జారితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మల్లు రవి, ఈరవర్తి అనిల్‌ కుమార్‌, రోహిణ్‌రెడ్డి తదితరులు శనివారం గాంధీభవన్‌లో  మాట్లాడారు. కాంగ్రెస్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం లేదనడంలో వాస్తవం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని