ఆజాద్‌ను సంప్రదించాకే కశ్మీర్‌లో పార్టీ కమిటీల ఖరారు: కాంగ్రెస్‌

జమ్మూకశ్మీర్‌లో పార్టీ కమిటీల పునరుద్ధరణను సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను సంప్రదించిన తర్వాతే చేపట్టినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత కమిటీల్లో ఎవరెవరు ఉండాలనే విషయమై

Published : 18 Aug 2022 05:51 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పార్టీ కమిటీల పునరుద్ధరణను సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను సంప్రదించిన తర్వాతే చేపట్టినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత కమిటీల్లో ఎవరెవరు ఉండాలనే విషయమై నాలుగు దఫాలు ఆజాద్‌తో చర్చలు జరిపామని, చివరిగా జులై 14న ఆయనతో భేటీ అయ్యామని పేర్కొన్నాయి. ఆజాద్‌ ఇచ్చిన జాబితా నుంచే ఆయా కమిటీలకు వ్యక్తుల పేర్లను ఎంపిక చేసినట్లు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా గులాం నబీ ఆజాద్‌ను మంగళవారం సోనియాగాంధీ నియమించారు. అయితే, ఆ తర్వాత కొద్ది సమయానికే ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. గతంలో సైఫుద్దీన్‌ సౌజ్‌ జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆజాద్‌...పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశాయి. అయితే, పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడినైన తాను రాష్ట్ర స్థాయి కమిటీకి నేతృత్వం వహించడం ఏమిటనే అభిప్రాయంతో తాజా నియామకాన్ని ఆజాద్‌ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు