Telangana News: తెదేపాకు రాజీనామా చేస్తా.. కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి

తెదేపాకు రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఆయన సతీమణి, మాజీ

Updated : 19 Aug 2022 07:41 IST

దేవరకద్ర గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపాకు రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతతో కలిసి తెదేపా కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లి లాంటిదన్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీ మార్పు తప్పనిసరిగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు సూచించిన పార్టీలో చేరతానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని