రైతుల పాదయాత్రపై ఆంక్షలెందుకు?

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న రైతుల పాదయాత్రపై అన్ని ఆంక్షలు ఎందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌ను సీఎంగా దిగిపొమ్మని.

Published : 26 Sep 2022 04:49 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న రైతుల పాదయాత్రపై అన్ని ఆంక్షలు ఎందుకని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌ను సీఎంగా దిగిపొమ్మని.. వాళ్లు గద్దె ఎక్కుతామని అడగడం లేదు కదా అని ఆయన నిలదీశారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై ఒక పక్క వైకాపా కార్యకర్తలు, మరో పక్క పోలీసులు దాడులు చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో నారాయణ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు మూడు రాజధానులంటూ మాటమార్చారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారని, రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకోరని.. అలాంటిది ఏమైనా చేస్తే వైకాపా గూండాలు మాత్రమే చేస్తారని చెప్పారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలు భాజపా వ్యతిరేక కూటమి బలపడేందుకు వేదిక కానున్నట్లు చెప్పారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదని.. చనిపోయిన నాయకుల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని