ఏపీపై హరీశ్‌రావు చెప్పింది నిజం

రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్‌లు చేసిన వ్యాఖ్యలపై వరంగల్‌ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

Published : 01 Oct 2022 04:43 IST

వైకాపా నాయకుల వ్యాఖ్యలపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం

నర్సంపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్‌లు చేసిన వ్యాఖ్యలపై వరంగల్‌ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని, ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజమేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే.. పక్క రాష్ట్రంలో 66 శాతానికి మించి ఇవ్వలేదన్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి, ఏపీలో ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఫిర్యాదు చేసిందన్నారు. తాము విడిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంటే ఈర్ష్య పడుతున్నారని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని