అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు రాజకీయాలు తగవు

దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మ దర్శనానికి వచ్చిన ప్రతిపక్ష నాయకులకు రాజకీయాలు తగవని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 02:28 IST

దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ(ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మ దర్శనానికి వచ్చిన ప్రతిపక్ష నాయకులకు రాజకీయాలు తగవని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... ‘ప్రతిపక్ష నాయకులు రూ.150కోట్లతో దుర్గగుడిని అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదం. అభివృద్ధి పేరుతో శాశ్వత కట్టడాలు కూల్చడం, ఆలయాలను తొలగించడం మినహా చేసింది ఏమీ లేదు... ’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని