Andhra News: ‘ఉమ్మడి ఏపీ అటుంచి.. ముందుగా జగన్‌, షర్మిలను కలపండి’

విభజన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఉమ్మడి ఏపీని స్వాగతిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం దారుణమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు.

Updated : 09 Dec 2022 09:54 IST

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విభజన హామీలను గాలికొదిలేసి ఇప్పుడు ఉమ్మడి ఏపీని స్వాగతిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం దారుణమని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైకాపా కొత్త నాటకానికి తెరతీసిందని గురువారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ‘అధికారంలోకి రాగానే ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ధారాదత్తం చేశారు. నాటి విభజన పర్వంలో ఆర్టికల్‌3 ద్వారా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవచ్చని సలహా ఇస్తూ లేఖ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? రెండు రాష్ట్రాలను కలపడం దేవుడెరుగు.. ముందుగా ఏపీలో ఉన్న అన్న సీఎం జగన్‌ను, తెలంగాణలో ఉన్న చెల్లి షర్మిలను కలపాలి. వైఎస్‌ కుటుంబాన్ని కలపలేని మీరు రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారు?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని