Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ధారపోశాను..: గులాం నబీ ఆజాద్‌

కాంగ్రెస్‌పార్టీ తన రక్తం ధారపోస్తే.. ఇప్పుడు ఆ పార్టీ  విస్మరించిందని జమ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. ఆయన శనివారం జమ్ములోని సైనిక్ ఫామ్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో

Published : 05 Sep 2022 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌పార్టీకి తన రక్తం ధారపోస్తే.. ఇప్పుడు ఆ పార్టీ  విస్మరించిందని జమ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. ఆయన శనివారం జమ్ములోని సైనిక్ ఫామ్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మా కృషితో కాంగ్రెస్‌ ఏర్పడిందిగానీ.. ట్విటర్‌, కంప్యూటర్లతో కాదని ఎద్దేవా చేశారు. 

ఇక సొంతపార్టీ ఏర్పాటుపై ఆజాద్‌ మాట్లాడారు. తమ పార్టీ జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, భూమి హక్కుల కోసం, స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ము కశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, పతాకాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని తెలిపారు. 

ఇటీవల గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి జమ్ముకశ్మీర్‌ కాంగ్రెస్‌లో రాజీనామాలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ నేతలు తారా చంద్‌, అబ్దుల్‌ మజిద్‌ వనీ, మనోహర్‌ లాల్‌ శర్మ,ఘరు రామ్‌, బల్వాన్‌ సింగ్‌ వంటి ఆజాద్‌ పక్షాన నిలిచారు. శనివారం పార్టీ నేత అశోక్‌ శర్మ కూడా తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీకి పంపారు. ఆయన కూడా గులాం నబీ ఆజాద్‌ పార్టీలో చేరనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని