Andhra News: కోడెల శివరాం అరెస్టు.. సత్తెనపల్లిలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా పేరేచర్ల- కొండమోడు రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలంటూ తెదేపా నేత కోడెల శివరాం చేపట్టిన చంద్రన్న ఆశయ సాధన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

Published : 19 Feb 2022 12:46 IST

గుంటూరు: గుంటూరు జిల్లా పేరేచర్ల- కొండమోడు రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలంటూ తెదేపా నేత కోడెల శివరాం చేపట్టిన చంద్రన్న ఆశయ సాధన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ సత్తెనపల్లిలోని ఎన్టీఆర్‌ భవన్‌, శివరాం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పలువురు నేతను ముందస్తు అరెస్టు చేశారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్‌ భవన్‌కు వెళ్లిన శివరాం.. పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.

అప్పటికే ఎన్టీఆర్‌ భవన్‌ను ముట్టడించిన పోలీసులు పాదయాత్రకు బయలుదేరుతున్న శివరాంను అడ్డుకొని పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. కార్యాలయం నుంచి తప్పించుకొని తాలూకా సెంటర్‌ను వెళ్లిన శివరాం.. రోడ్డుపై బైఠాయించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. తెదేపా శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫలితంగా ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెల్తాయి. చివరకు కార్యకర్తలను దాటుకొని వెళ్లిన పోలీసులు తెదేపా నాయకులతో పాటు శివరాంను అరెస్టు చేశారు. తర్వాత ఆయనను గుంటూరు వైపు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని