Nellore: నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు.

Updated : 19 Apr 2024 19:31 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. ఇటీవల విడవలూరు మండలానికి చెందిన 40 మంది కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరగా.. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపు 100 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. 

తమ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా తెదేపాలో చేరిన వాలంటీర్లకు నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా నారాయణ చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు నెలకు రూ.10వేలు గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. అర్హతను బట్టి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని