BJP: జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ భాజపా నేతల కీలక సమావేశం

అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై భాజపా అధిష్ఠానం కీలక కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సమావేశమై చర్చించింది.

Published : 19 Oct 2023 20:36 IST

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై భాజపా అధిష్ఠానం కీలక కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సమావేశమై చర్చించింది. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరయ్యారు. భాజపా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల బాధ్యులు సునీల్‌ భన్సల్‌, తరుణ్‌ చుగ్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ప్రచార సరళిని ముమ్మరం చేయడంతో పాటు, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. శుక్రవారం భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు