కేరళలో ఎల్‌డీఎఫ్‌ జోరు..

కేరళలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తొల గంటల ఫలితాల సరళిలో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యంలో.........

Updated : 02 May 2021 11:32 IST

భాజపా 2 స్థానాల్లో ముందంజ

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. సీఎం పినరయి విజయన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భాజపా సీఎం అభ్యర్థి, మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ పాలక్కాడ్‌ నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. యూడీఎఫ్‌ కూటమి నేత, మాజీ సీఎం ఊమెన్‌ చాందీ పూతుపల్లిలో ఆధిక్యం కనబరుస్తున్నారు. అలాగే కేరళ భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు కే.సురేంద్రన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి అధికార ఎల్‌డీఎఫ్‌ 89 స్థానాల్లో , యూడీఎఫ్‌ 49 సీట్లలో, భాజపా రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 140 స్థానాలున్న కేరళలో అధికారం చేపట్టడానికి 71 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని