kishan Reddy : పారిశుద్ధ్య కార్మికురాలి ఇంట్లో కిషన్‌రెడ్డి అల్పాహారం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరింది. స్థానిక చింతల చెరువులో

Published : 20 Aug 2021 10:27 IST

సూర్యాపేట : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరింది. స్థానిక చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో ఆయన అల్పాహారం చేశారు. అనంతరం ఆమెను సన్మానించారు. కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహానికి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత రెండో రోజు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.

‘కేబినెట్‌ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ నాకు పదోన్నతి కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రధాని ఆదేశించారు. రైతులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను కలవాలని కోరారు. జాతీయ అవార్డు పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మ ఇంట్లో అల్పాహారం తీసుకున్నాను. కరోనా పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టకుండా ఆమె విధులు నిర్వర్తించారు. కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలి. చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను ప్రధాని త్వరలో ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీపావళి వరకు ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీని అవసరమైతే మరికొన్ని రోజులు ఇస్తాం. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు రూ.5 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుంది. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి విద్యాభ్యాసం అందిస్తాం. కరోనా వారియర్స్‌ను ప్రోత్సహించాలి. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రిని తొమ్మిది సార్లు పరిశీలించాను’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని