Kishan Reddy: కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 11 Jan 2024 17:27 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరిస్తోంది. ఆ పార్టీ.. హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉంది. దేశంలో రోజు రోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడం.. రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమే. ఆ పార్టీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతుంది. జీ20, పార్లమెంట్‌, అఖిలపక్షం, ఎన్నికల కమిషన్‌ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని