KTR: ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు వదిలిపెట్టం: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే పలు వర్గాలు దూరమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

Updated : 22 Jan 2024 20:11 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే పలు వర్గాలు దూరమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. ఇన్నేళ్లుగా వారి వల్లే బలంగా ఉంది. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయి. మనం పూర్తిగా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ నేతలు అప్పుడే ఉలిక్కి పడుతున్నారు. అధికారంలోకి వస్తామని వాళ్లు ఊహించలేదు. అందుకే ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని