పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఆశ్చర్యకర పరిణామం.. పీఎంను కలిసిన ఎంపీ బిట్టు

కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.  నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తరువాత పీసీసీ అధ్యక్షుడు ఎవరనే మంతనాలు కొనసాగుతున్న నేపథ్యంలో లుథియానా ఎంపీ రావనీత్‌ బిట్టు సోమవారం పీఎం నరేంద్ర మోదీని కలవడం అనేక సందేహాలకు దారితీస్తోంది.

Published : 05 Apr 2022 15:58 IST

దిల్లీ : పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.  నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తరువాత పీసీసీ అధ్యక్షుడు ఎవరనే మంతనాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేత, లుథియానా ఎంపీ రవ్‌నీత్‌ బిట్టు సోమవారం పీఎం నరేంద్ర మోదీని కలవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించడానికి పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ దిల్లీలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రేస్‌లో ఉన్న ఎంపీ బిట్టు ప్రధానిని కలిసిన ఫోటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్టు రాకపోయినా, పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కకపోయినా రాజకీయ భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడే ప్రమాదముందని,  దాన్ని  ముందుగానే ఊహించి భాజపాలో చేరేందుకే ప్రధానిని కలిసినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.  ఈ వారంలో పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రవ్‌నీత్‌ బిట్టు, సుఖ్‌జిందర్‌ రణ్‌దావా, అమరీందర్‌ రాజా అధ్యక్షుడి రేస్‌లో ఉన్నారు.  సుఖ్‌పాల్‌ ఖైరాకు పదవీ కట్టబెట్టడం కోసం మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  సిద్దూ గత కొద్ది వారాలుగా పార్టీ సభ్యులతో సమావేశమవుతున్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని