Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే మంత్రులు, వైకాపా నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy) అన్నారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అన్నింటికీ తెగించిన వాళ్లే తనతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

Updated : 08 Feb 2023 11:47 IST

నెల్లూరు: ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy) తెలిపారు. అపాయింట్‌మెంట్‌ దొరకగానే నేరుగా వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నెల్లూరు(Nellore)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తే మంత్రులు, వైకాపా (YSRCP) నేతలు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. తనకు ఇంకా బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అన్నింటికీ తెగించిన వాళ్లే తనతో ఉన్నారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికేసులైనా పెట్టుకోవచ్చని.. అవి తమకు కొత్త కాదన్నారు. దేనికైనా సిద్ధమని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా.. రాజ్యాంగబద్ధంగా పోరాడతామన్నారు.

‘‘నేను ఆరోపణలు చేస్తే మీరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలి. నాపై శాపనార్థాలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో రోడ్లు, వాటర్‌ వర్క్స్‌పై మాట్లాడితే తప్పా?కాంట్రాక్టర్‌ పనులు ఆపేస్తే ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. సగంలో పనులు ఆగిపోయాయి.. కేవలం రూ.10కోట్లు విడుదల చేస్తే సరిపోతుంది. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు సమస్యను సీఎంకు నేరుగా చూపించా. ప్రభుత్వం నిధుల విడుదల చేసి కాంట్రాక్టర్‌కు సూచనలు చేస్తే బాగుంటుంది. నియోజకవర్గంలోని పెండింగ్‌ పనులు, రోడ్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 17న జిల్లా కలెక్టరేట్‌, 25న ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’’ అని కోటంరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని