Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌.. ఓటేసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, పలువురు మంత్రులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 23 Mar 2023 10:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. తెదేపా నుంచి పంచుమర్తి అనురాధ, వైకాపా నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసిన అధికార వైకాపా.. వారితో ఓట్లు వేయిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని