Nadendla Manohar: ముఖ్యమంత్రి గారూ ఇప్పుడు చెప్పండి.. ఎవరు పెత్తందారో?: నాదెండ్ల

దమ్ముంటే రుషికొండపై నిర్మించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమని చెప్పాలని సీఎం జగన్‌కు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సవాల్‌ విసిరారు.

Updated : 20 Nov 2023 20:10 IST

అమరావతి: రుషికొండలో రాజమహల్‌ నిర్మించుకుంటూ క్లాస్‌వార్‌ అంటారా? అని సీఎం జగన్‌ను జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ప్రశ్నించారు. పేదవాడికి సెంటు భూమే.. కానీ, ముఖ్యమంత్రి ఇంటికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సీఎం నివాసంలో పచ్చదనానికి రూ. 21 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో కనీస వసతులు లేవని దుయ్యబట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మాట్లాడారు.

‘‘ముఖ్యమంత్రి గారూ ఇప్పుడు చెప్పండి.. ఎవరు పెత్తందారో? ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విధంగా వ్యవహరించలేదు? రుషికొండపై టూరిజం ప్రాజెక్టు అంటూ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు. న్యాయస్థానాల అఫిడవిట్లలోనూ అదే చెప్పారు. అటు బ్యాంకులను మోసం చేస్తూ కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. దమ్ముంటే రుషికొండపై నిర్మించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని చెప్పండి’’ అని నాదెండ్ల మనోహర్‌ సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని