Nadendla Manohar: నవంబరు 1 నాటికి తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో: నాదెండ్ల మనోహర్‌

రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన-తెదేపా సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయటంలో మరో ముందడుగు పడింది.

Published : 26 Oct 2023 22:22 IST

అమరావతి: రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన-తెదేపా సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రస్థాయిలో పొత్తును క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అక్టోబరు 29, 30, 31వ తేదీల్లో జిల్లా స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కన్వీనర్లతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈనెల 29 నుంచి 3రోజుల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఉమ్మడి పోరాట కార్యాచరణ ఖరారు చేయాలన్నారు. పొత్తుని విచ్ఛిన్నం చేసేందుకు వైకాపా పన్నే ఉచ్చులో పడొద్దని జనసేన నేతలకు నాదెండ్ల సూచించారు.

సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. సహృద్భావ వాతావరణంలో సమావేశాలు జరగాలన్నారు. భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో పాటు తెదేపా సూపర్ సిక్స్‌లో ప్రకటించిన అంశాలను కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నాటికి ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం అవుతుందని నాదెండ్ల తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని