Yuvagalam: వైకాపా సైకోలకు జగన్‌ లైసెన్స్‌ : లోకేశ్‌

వైకాపా (YSRCP) పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. యువగళంలో భాగంగా చిత్తూరులోని దళితులతో ఆయన మాట్లాడారు.

Updated : 04 Feb 2023 17:15 IST

చిత్తూరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్‌ (CM Jagan) పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. చిత్తూరు జిల్లాలో యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా సదకుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. స్థానిక దళితులతో మాట్లాడారు. ఎస్సీలపై దాడులు పెరిగిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని అన్నారు. ఎస్సీలపై దాడులు, హత్యలకు పాల్పడేందుకు వైకాపా సైకోలకు సీఎం జగన్‌ లైసెన్స్‌ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. దళితులపైనే తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టిన ఉదంతాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే..చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

తెదేపా నాయకుల సంబరాలు

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి ఇంటి ఎదుట పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే లోపే... ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, పాదయాత్ర పూర్తయ్యేనాటికి ఒక్క ఎమ్మెల్యే కూడా వైకాపాలో మిగలరని ఈ సందర్భంగా పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని గౌరు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ స్పందించి పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని