NDA: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.

Updated : 09 Apr 2024 17:04 IST

దిల్లీ: పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా.. రాష్ట్రంలో 33 మంది వృద్ధులు మరణించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు.

కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అధికార వైకాపాకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దే పింఛన్లు అందించేలా సీఎస్‌ను ఆదేశించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చూడాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి విన్నవించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని