PM Modi: ‘‘పచ్చి అవినీతిపరుల సదస్సు’’.. విపక్షాల భేటీపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విపక్షాలపై ఎదురు దాడి చేశారు. బెంగళూరులో జరగుతున్న ప్రతిపక్షాల సమావేశాన్ని ఓ అవినీతిపరుల సదస్సుగా అభివర్ణించారు.

Updated : 18 Jul 2023 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ప్రధాని మోదీ(PM Modi) విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టారు. పోర్టుబ్లెయర్‌లోని వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీ విమానాశ్రయ టర్మినల్‌ భవనాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండింతల నిధులను అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పనిలో పనిగా విపక్షాలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది వారి మంత్రం. పచ్చి అవినీతిపరులు సదస్సు జరుగుతోంది’’ అని విరుచుకుపడ్డారు.

సార్వత్రికానికి సై.. నేడు దిల్లీలో ఎన్డీయే పక్షాల భేటీ

‘‘ గత 9 ఏళ్లలో పాత ప్రభుత్వాల తప్పులు సరిచేయడంతోపాటు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు భారత్‌లో కొత్తరకం అభివృద్ధి విధానం ఉంది. అదే సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో పెరిగిన పర్యాటక రంగం మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించిందన్నారు. కానీ, గతంలో స్వార్థపూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులు మారుమూల ప్రాంతాలకు చేరడం సాధ్యం కాలేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో ఈ ద్వీపాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందిందని పేర్కొన్నారు.

మరోవైపు బెంగళూరు(Bengaluru )లో నిన్న మొదలైన విపక్షాల భేటీ నేడు కూడా కొనసాగనుంది. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి  కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని